‘ఉస్తాద్ భగత్ సింగ్’ టైటిల్ పేరు మార్పు వెనక రీజన్ అదే : Harish Shankar

‘ఉస్తాద్ భగత్ సింగ్’ టైటిల్ పేరు మార్పు వెనక రీజన్ అదే

Update: 2024-08-23 07:56 GMT

దిశ, సినిమా : డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ వస్తున్న విషయం మనకీ తెలిసిందే.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం ఇది షూటింగ్ జరుపుకుంటుంది. పవన్ ఏపీ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యారు. దీంతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది.

అయితే, ఫ్యాన్స్ కి చిత్ర టీం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా, మొదట ఈ సినిమాకి ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ అనే టైటిల్‌ను పెట్టారు. అయితే, కొన్ని కారణాల వల్ల మూవీ పేరును వెంటనే ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’గా మార్చారు. అసలు ఈ మూవీ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో కారణాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ తెలిపాడు.

” ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ అని టైటిల్‌ చెప్పినప్పుడు చాలామంది.. ఇది కొత్తగా ఉందేంటని ఆశ్చర్యపోయారు. కానీ, ఎవరు దీన్ని సరిగా అర్ధం చేసుకోలేకపోయావు. భగత్‌ సింగ్ అంటే ఒక విస్ఫోటనం.. అందుకే ఇది పెట్టాము. పవన్‌కల్యాణ్‌ కి ఈ టైటిల్ బాగా నచ్చింది ఇదే ఒకే చేయమని కూడా చెప్పారు. ఆ టైటిల్‌ అనౌన్స్ చేసాక అందరికి కనెక్ట్‌ కాలేదు. ఇంక స్క్రిప్ట్‌ కూడా కొంచం మారింది. హీరో క్యారెక్టరైజేషన్‌ మాత్రం అలాగే ఉంది.ఈ రోజుల్లో భగత్‌సింగ్‌ అంటే ఇలా ఉండాలనే సందేశంతో అది పెట్టాం” అంటూ ఆయన మాటల్లో చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News