శరత్ బాబు మృతికి అసలు కారణం అదే.. వెలుగులోకి సంచలన నిజాలు

వెండితెరపై వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సీనియర్ నటుడు శరత్ బాబు (71) సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే.

Update: 2023-05-23 04:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: వెండితెరపై వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సీనియర్ నటుడు శరత్ బాబు (71) సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన ఆయన నిన్న తుది శ్వాస విడిచారు. శరత్ బాబు మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు సంతానం తెలియజేశారు. కాగా.. శరత్ బాబు మృతికి అసలు కారణం వయసు సంబంధిత సమస్యలకు తోడు శరీరం మొత్తం పాయిజన్ అయిందని వైద్యులు తెలిపారు.

దీంతో ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి ప్రధాన అవయవాలు పాడైపోయాయి. గత కొన్ని నెలలుగా చెన్నైలో ట్రీట్‌మెంట్ తీసుకున్న ఆయన వైద్యుల సలహా మేరకు కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నప్పటికీ కోలుకోలేకపోయారు. దీంతో నిన్న ఉదయం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో మధ్యాహ్నం కన్నుమూసినట్లు శరత్ బాబు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. సీనియర్ నటుడు శరత్ బాబు మరణ వార్తతో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read More:   ‘శరత్ బాబు సిగరేట్ కాల్చొద్దు అనేవారు’

Tags:    

Similar News