వివాదంలో ‘రామబాణం’ సాంగ్.. ఆ టూన్ నాదే అంటున్న జానపద గాయకుడు
టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రస్తుతం ‘రామబాణం’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రస్తుతం ‘రామబాణం’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో డింపుల్ హయాతీ హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, ఖుష్బూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించాడు. రామబాణం మే 5న థియేటర్స్‌లో విడుదల కానుంది. మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా, రామబాణం సినిమా సాంగ్ చిక్కుల్లో పడింది. ఐఫోన్ పిల్లా సాంగ్ అంటూ సాగే పాట ఇందులో నా ప్రాణం ఆగదే పిల్ల లిరిక్ నాదని కరీంనగర్‌కు చెందిన జానపద గాయకుడు గొల్లపల్లి రవీందర్ మీడియా ముందుకు వచ్చాడు.
రవీందర్ మాట్లాడుతూ.. ‘‘నేను గత 30 ఏళ్లుగా పాటలు పాడుతున్నాను. 1992లో చేతికి గాజులు పిల్లో.. అనే పాట రాశాను. అప్పట్లో ఆ పాట బాగా హిట్ అయింది. ఆ పాటలోని లైన్‌ను, నా ట్యూన్‌ను రామబాణం యూనిట్ వాళ్ళు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాడుకున్నారు. మూడు రోజుల్లోగా మ్యూజిక్ డైరెక్టర్ కానీ, చిత్ర యూనిట్ కానీ దీనిపై నాకు వివరణ ఇవ్వాలి లేకపోతే లీగల్‌గా వెళ్తాను అంటూ ఫైర్ అయ్యాడు. అలాగే అతను రాసిన పాటను అందరికి మీడియా ముందు వినిపించారు. అప్పటి క్యాసెట్స్ తెచ్చి చూపించడంతో అది కాస్త వైరల్‌గా మారింది. మరి దీనిపై చిత్రయూనిట్ ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.