Dogs: ప్రపంచవ్యాప్తంగా తేలిన కుక్కల లెక్క.. అగ్రరాజ్యమే టాప్

ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పెంపుడు జంతువులలో కుక్క ఒకటి.

Update: 2023-04-04 08:41 GMT

దిశ, సినిమా: ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పెంపుడు జంతువులలో కుక్క ఒకటి. ఇది పురాతన కాలం నుంచి మానవుడి జీవితంలో ఓ భాగమైపోయింది. అంతేకాదు మనిషి మేధోశక్తి అభివృద్ధి చెందుతున్న కొద్ది తన శ్రమను తగ్గించుకోవడానికి జంతువు సహాయం తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మానవుడికి అత్యంత విశ్వాసమున్న ప్రాణిగా మారిన కుక్క ప్రజలకు రక్షణనివ్వడంలోనూ తనవంతు ప్రాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల కుక్కులు జీవిస్తున్నాయి? ఏ దేశంలో ఎన్ని ఉన్నాయి? అనే లెక్కలను తాజాగా యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన ఓ సర్వే వెల్లడించింది.

ఈ మేరకు అనేక దేశాలలో ‘ఫెరల్ డాగ్స్’ ప్రబలంగా ఉన్నాయి. వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో సంచరించే కుక్కలతోపాటు భూమి మీద నివసిస్తున్నవి మొత్తం కలిపి ప్రపంచంలో 900 మిలియన్ కుక్కలు ఉన్నాయని తాజా పరిశోధనలో అంచనా వేశారు. అలాగే మొత్తం జనాభాలో దాదాపు 75% నుంచి 85% వరకు ఫెరల్ డాగ్స్ ఉండగా.. మిగిలిన జనాభాలో టైమ్ పాస్‌కు పెంచుకునే పెంపుడు కుక్కలు, పని చేసే కుక్కలు, వేట కుక్కలు లేదా వ్యవసాయ కుక్కలున్నట్లు కనుగొన్నారు. ఇక విశ్వసనీయ స్వభావం, కష్టపడి పనిచేసే వైఖరి, విధేయత వాటికి గొప్ప ఆస్తులుగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

అలాగే యునైటెడ్ స్టేట్స్‌లో అత్యధికంగా 76 మిలియన్ల కుక్కలు ఉండగా.. ప్రతి 1000 మందిలో 274 మంది డాగ్స్ పెంచుకుంటున్నారట. బ్రెజిల్ 36 మిలియన్లతో రెండో స్థానం, చైనా 27 మిలియన్లతో మూడో స్థానంలో ఉంది. భారతదేశంలో 10 మిలియన్లు పెంపుడు కుక్కలు ఉండగా 2023 నాటికి 31 మిలియన్లకు చేరుతుందని అంచనా వేయబడింది. ఒక యజమాని సగటుగా ఒక పెంపుడు కుక్కపై సంవత్సరానికి దాదాపు రూ. లక్ష ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇక కొన్ని దేశాల్లో కుక్కలను, పబ్లిక్ ప్లేస్, రెస్టారెంట్, కార్లలో తీసుకెళ్లడంపై కఠినమైన షరతులను అమలు చేస్తున్నారు. 

Tags:    

Similar News