దళితులకు ‘ఆదిపురుష్‌’ థియేటర్లలోకి నో ఎంట్రీ.. వివాదంపై స్పందించిన మూవీ యూనిట్..

గ్లోబల్ స్టార్ ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌’ రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కింది.

Update: 2023-06-08 08:30 GMT

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌’ రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కింది. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో ప్రభాస్‌ రాముడిగా కనిపిస్తుండగా.. జానకిగా బాలీవుడ్‌ బ్యూటీ కృతిసనన్‌ నటించారు. రూ.550 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా జూన్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. ఇక పోతే ‘ఆదిపురుష్‌’ ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదంటూ రిలీజ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. అయితే తాజాగా దీనిపై మూవీ టీం క్లారిటీ ఇచ్చింది. ‘ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం. అనవసరంగా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ ఫేక్ న్యూస్‌ను నమ్మవద్దు. ఏ కుల, మత, వర్ణ వివక్షతకు తావులేకుండా సమానత్వం కోసం ‘ఆదిపురుష్’ బృందం శ్రమించింది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని అడ్డుకుని మా ‘ఆదిపురుష్‌’ టీమ్‌కు సహకరించాలని చిత్రబృందం విజ్ఞప్తి’ అని కోరింది మూవీ యూనిట్.

Tags:    

Similar News