Stree 2 Trailer: ఓ వైపు నవ్విస్తూనే దడ పుట్టిస్తోన్న స్త్రీ 2 ట్రైలర్

రూ. 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రూ. 180 కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది.

Update: 2024-07-19 04:12 GMT

దిశ, సినిమా: 2018 లో రిలీజ్ అయినా స్త్రీ మూవీ ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందో మనకి తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టింది. రూ. 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రూ. 180 కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. పార్ట్ 1 లో నటించిన హీరో రాజ్ కుమార్ రావు, హీరోయిన్ శ్రద్ధా కపూర్ పార్ట్ 2 లో కూడా నటిస్తున్నారు. సినిమా వచ్చి ఐదేళ్లు దాటినా పార్ట్ 2 ట్రైలర్ రిలీజ్ అవ్వగానే మిలియన్ వ్యూస్ దూసుకెళ్తుంది. అమర్ కౌశిక్ డైరెక్షన్ వహించగా.. షూటింగ్ మొత్తం కంప్లిట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

ఇటీవలే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు వేపించుకుంది. తాజాగా ఈ మూవీ మేకర్స్ స్త్రీ 2 ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా కూడా ఉన్నట్టు తెలుస్తుంది ట్రైలర్లో ఆమె వేసిన డ్యాన్స్ కనిపించింది. తాజాగా, రిలీజ్ అయినా ట్రైలర్ ఓ వైపు భయపెడుతూనే ఇంకో వైపు కామెడీతో నవ్విస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ మూవీ ఈ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Full View

Tags:    

Similar News