యూఎస్‌లోనూ దుమ్మురేపుతున్న 'ధమాకా'
టాలీవుడ్ మాస్ హీరో రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీ లీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ " ధమాకా ".
దిశ, సినిమా : టాలీవుడ్ మాస్ హీరో రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీ లీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ " ధమాకా ". ఇది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి రోజునే ఈ మూవీ హిట్‌టాక్‌ను సొంతం చేసుకొని, బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మూడు రోజుల్లోనే రూ.30 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు క్రియోట్ చేసింది. అసలు విషయం ఏమిటంటే ధమాకా మూవీ మన తెలుగు రాష్ట్రాల్లోనే గాక, US బాక్సాఫీస్ వద్ద కూడా సూపర్ రన్నర్‌గా దూసుకెళ్తూ.. తాజాగా 2 లక్షల 50 వేల డాలర్స్ మార్క్‌ను క్రాస్ చేసింది.