Devara Song: ఎప్పుడొచ్చినా భీభత్సమే అంటూ.. దేవర మూడో పాటపై లిరిసిస్ట్ ట్వీట్

ఎప్పుడొచ్చినా భీభత్సమే పక్కా.

Update: 2024-08-28 06:59 GMT

దిశ, వెబ్ డెస్క్: కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ దేవర. ఈ మూవీలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ కోసం అభిమానులు ఎంత గానో వెయిట్ చేస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న దేవర పార్ట్  1 సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయినా గ్లింప్స్, రెండు పాటలు సినిమాపై అంచనాలు భారీగానే పెంచేసాయి. త్వరలో మూడో పాట కూడా విడుదలవ్వనుందని నెట్టింట ఎన్నో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

దేవర పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా దేవర మూడో పాట పై ట్వీట్ చేసారు. రామజోగయ్య శాస్త్రి తన ట్వీట్ లో.. మూడో పాట..అంతకి మించి ఉంటుందనే హింట్ అయితే ఇచ్చేసాడు.. రామజోగయ్య శాస్త్రి తన ట్వీట్ లో ఒక ఆట ఆడుకున్నాడట తారకరాముడు. ఎప్పుడని అడక్కండి. ఎప్పుడొచ్చినా అది భీభత్సమే అవుతుంది. ఇప్పుడొచ్చేది వేరే లెవెల్ అంతే అని ట్వీట్ చేసారు.

దీంతో ఈ పాటలో ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్స్ వేయబోతున్నారని అర్ధమవుతుంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ పాటను రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ ఈ సాంగ్ కోసం చాలా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News