ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న 'Unstoppable Season 2'
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమవుతోన్న 'అన్‌స్టాపబుల్ సిజన్ 2' టాక్ షో రికార్డులు సృష్టిస్తోంది..
దిశ, సినిమా: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమవుతోన్న 'అన్‌స్టాపబుల్ సిజన్ 2' టాక్ షో రికార్డులు సృష్టిస్తోంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ షో ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ నాలుగు ఎపిసోడ్‌లు పూర్తి చేసుకోగా ఐదో ఎపిసోడ్‌కు లెజెండరీ దర్శకనిర్మాతలు కె. రాఘవేంద్రరావు, డి. సురేష్ బాబు, అల్లు అరవింద్, ఏ. కోదండరామిరెడ్డి హాజరయ్యారు. డిసెంబర్2 (శుక్రవారం) రాత్రి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది. ఇందులో తెలుగు సినిమాకు 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను రూపొందించారు. ఇక ఈ ఎపిసోడ్ ఒక్కొక్కరిని మామూలుగా ఆకట్టుకోలేదు. కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 30 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను రాబట్టింది. ఇక తర్వాత ఎపిసోడ్‌కు ఎవరొస్తున్నారు అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరిగింది.
ఇవి కూడా చదవండి : బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న హైబ్రిడ్ పిల్ల?
బీజేపీతో టీడీపీ పొత్తు.. మోడీతో బాబు మాటామంతి సంకేతమిదేనా?
Matallo marintha fire 🔥. Kaburlalo marintha fun. Maruvaleni kathalu, inka enneno. An episode that you can't miss😉Watch #UnstoppableWithNBKS2 Episode 5 Streaming Now@SBDaggubati #alluarvind#kodandaramireddy @Ragavendraraoba #MansionHouse @tnldoublehorse @realmeIndia pic.twitter.com/f6JDjDfrtZ
— ahavideoin (@ahavideoIN) December 5, 2022