దాదాపు 8 నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతున్న ‘ది కేరళ స్టోరీ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఈ మధ్య కాలంలో సినిమాలు థియేటర్ల కంటే ఓటీటీ ప్లాట్ ఫామ్‌లోనే ఎక్కువగా విడుదల అవుతున్నాయి.
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో సినిమాలు థియేటర్ల కంటే ఓటీటీ ప్లాట్ ఫామ్‌లోనే ఎక్కువగా విడుదల అవుతున్నాయి. ఇక పెద్ద, చిన్న అనే తేడా లేకుండా.. మూవీ టాక్ యావరేజ్ ఉంటే 10 రోజులకే ఓటీటీలో దర్శమిచ్చేస్తున్నాయి. అయితే బడా హీరోల సినిమాలు మాత్రం కొంచెం అటూ ఇటూగా 30 రోజుల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ, విడుదలై దాదాపు 8 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఓటీటీకి రాని చిత్రం ‘ది కేరళ స్టోరీ’.
ఎన్నో వివాదాల మధ్య రిలీజైన ఈ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. లవ్ జిహాద్ నేపథ్యంలో వచ్చిన ‘ది కేరళ స్టోరి’ అనేక వివాదాలకు దారి తీసినప్పటికీ.. కలెక్షన్లు మాత్రం భారీగా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే.. గతేడాది మేలో రిలీజైన ఈ మూవీపై.. తాజాగా ఓటీటీ అప్ డేట్ వచ్చింది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 కానీ, లేదా 19 కానీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇక థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ది కేరళ స్టోరీ’ ఓటీటీలో ఎలాంటి సందడి చేస్తుందో చూడాల్సి ఉంది.