Jani Master: జానీని ఇకపై 'మాస్టర్' అని పిలవొద్దంటూ ట్వీట్ చేసిన హీరోయిన్

ఇకపై షేక్ జానీ ని ఎవరు జానీ మాస్టర్ అని పిలవకండి.

Update: 2024-09-17 06:03 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీ లో తక్కువ సమయంలోనే ఫేమ్ అయినా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. బుట్ట బొమ్మ పాటకి కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతని పై ఓ యువతీ చేసిన లైంగిక ఆరోపణలు ఒక్కసారిగా అందర్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఆమెపై అత్యాచారం చేశాడని, లైంగికంగా వేధించాడని అతనే కాకుండా ఆయన భార్య కూడా టార్చర్ చేసిందని, యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాజాగా దీనిపై స్పందించిన ప్రముఖ సింగర్ చిన్మయి.. "యువతి మైనర్ గా ఉన్నప్పుడే ఇలా అత్యాచారానికి ఎలా పాల్పడ్డాడు. ఈ కేసులో ఆమె గట్టిగా పోరాడేందుకు మరింత శక్తి దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే తప్పు చేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ" పోస్టు లో రాసుకొచ్చింది. హీరోయిన్ పూనమ్ కవర్ కూడా.. మాస్టర్ ఫైర్ అవుతుంది " ఇకపై షేక్ జానీ ని ఎవరు జానీ మాస్టర్ అని పిలవకండి. మాస్టర్ అనే పదానికి విలువ ఇవ్వండి" అంటూ షాకింగ్ ట్వీట్ చేసింది.

Read More...

సీఎంతో చర్చించి జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకుంటాం : ఫిలిం చాంబర్ 

Tags:    

Similar News