‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై భారీ అంచనాలను పెంచేసిన ఫస్ట్ లుక్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.

Update: 2023-05-11 07:10 GMT

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇందులో పవన్‌కు జోడిగా శ్రీలీల నటింస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవల పూర్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ తెలిపారు. మే 11న ‘గబ్బర్ సింగ్’ సినిమా విడుదలై 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేస్తునట్టు తెలిపారు. తాజాగా, పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో పవన్ లుక్ అదిరిపోయింది. అంతేకాకుండా ఫస్ట్ గ్లింప్స్‌ను ఈ రోజు సాయంత్రం 4.59 గంటలకు విడుదల చేస్తునట్లు తెలిపారు. దీంతో అది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ యూట్యూబ్ షేక్ అవడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు.

Also Read:    ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల.. ఫ్యాన్స్‌కు పూనకాలే (వీడియో) 

Tags:    

Similar News