నాగబాబు పెట్టిన కండీషన్‌కు లావణ్య త్రిపాఠి ఒప్పుకున్నాకే ఎంగేజ్‌మెంట్ జరిగిందా?

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని జూన్ 9న ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2023-06-11 06:30 GMT

దిశ, వెబ్ డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని జూన్ 9న ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో వీరిద్దరూ వీరి ప్రేమ మొదలైన ఇటలీలో గ్రాండ్‌గా పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో వీరికి సంబంధించిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. పవన్ తప్ప మెగా ఫ్యామిలీలో ఎవరూ కూడా హీరోయిన్‌ను పెళ్లి చేసుకోలేదు. పవన్ తర్వాత ఇప్పుడు వరుణ్ మాత్రమే ఆపని చేస్తున్నాడు. దీంతో నాగబాబు చాలా విషయాలను ఆలోచించి లావణ్యకు కొన్ని కండిషన్లు పెట్టాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన కుటుంబంలో ఎలాంటి వివాదాలు రావొద్దని, నెగిటివిటీ క్రియేట్ కావొద్దనే ఉద్దేశంతో లావణ్యకు పెండ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని కండీషన్ పెట్టాడట. అంత పెద్ద కుటుంబానికి కోడలు కాబోతున్న లావణ్య కూడా ఆయన కండీషన్లకు ఒప్పుకున్న తర్వాత ఎంగేజ్‌మెంట్ జరిగిందట. దీంతో అది తెలిసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Read more: వరుణ్ ఎంగేజ్‌మెంట్‌కు పీకలదాకా తాగొచ్చిన పవన్ కల్యాణ్.. సంచలనం సృష్టిస్తోన్న పోస్ట్

Tags:    

Similar News