కన్నడ స్టార్ హీరో దర్శన్ కోసం జైలుకు వెళ్లిన డైరెక్టర్.. త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తారంటూ కామెంట్స్

కన్నడ స్టార్ హీరో దర్శన్ ఇటీవల ఓ అభిమాని హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు.

Update: 2024-07-21 05:59 GMT

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో దర్శన్ ఇటీవల ఓ అభిమాని హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం కేసు విచారణ సాగుతుండగా దర్శన్‌తో పాటు అరెస్ట్ అయిన పలువురు జైల్లోనే ఉన్నారు. అయితే ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు, దర్శన్ అభిమానులు దర్శన్‌కి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా దర్శకుడు తరుణ్ సుధీర్ జైల్లో దర్శన్‌ని కలిసాడు. కలిసి ఆగస్టులో నా పెళ్లి ఉందని చెప్పి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి ఆహ్వానించాడు. త్వరలోనే నిరపరాధిగా బయటకు వస్తావని ఓదార్చాడు.

జైల్లో దర్శన్‌ని కలిసిన అనంతరం తరుణ్ సుధీర్ మీడియాతో మాట్లాడుతూ.. “దర్శన్ ఎప్పట్లాగే నవ్వుతూ పలకరించాడు. అయితే ఆయన్ని చూస్తుంటే ఆరోగ్యం బాగోలేదు అనిపిస్తుంది. ఆయన అరెస్ట్ తర్వాత మేమంతా ఏదో కోల్పోయాము అనిపిస్తుంది. దర్శన్ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. నా పెళ్లి కుదిరిన సంగతి గతంలోనే దర్శన్‌కి తెలుసు. నా పెళ్లికి ఆహ్వానించడానికి జైలుకు వచ్చి దర్శన్‌ని కలిసాను. తన కోసం పెళ్లి వాయిదా వేసుకోకు అని తిట్టారు. ఆయన త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తారు. నా పెళ్ళికి హాజరవుతారు” అని అన్నాడు. దీంతో దర్శకుడు తన పెళ్లికి పిలవడానికి జైలుకు వెళ్లి మరీ దర్శన్‌ని కలవడంతో కన్నడ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

Tags:    

Similar News