అశ్లీల కంటెంట్‌తో ప్రచారమయ్యే 18 ఓటీటీ ప్లాట్‌‌ఫామ్‌లను బ్లాక్ చేసిన కేంద్రం.. వీటితో పాటు 57 సోషల్ మీడియా అకౌంట్లు!

అశ్లీల కంటెంట్‌ను ప్రచారం చేసే ఓటీటీ సంస్థలపై తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2024-03-14 08:08 GMT

దిశ, సినిమా: అశ్లీల కంటెంట్‌ను ప్రచారం చేసే ఓటీటీ సంస్థలపై తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 18ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను బ్లాక్‌ చేసేందుకు సిద్ధమయ్యింది. డిజిటల్‌ ప్లాట్ ఫామ్‌లలో పెరుగుతున్న అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌ని అరికట్టాలనే ఉద్దేశ్యంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నేడు (గురువారం) ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న 18 ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లపై చర్యలకు దిగింది. ‘‘Dreams Films, Tri Flicks, X Prime, Uncut Adda, Neon X VIP, Besharams, Voovi, Xtramood, Nuefliks, MoodX, Mojflix, Rabbit, Hot Shots VIP, Fugi, Yessma, Hunters, Chikooflix and Prime Play వంటి ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ బ్లాక్ చేయనుంది. అలాగే ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు లింక్‌ అయి ఉన్న 19 వెబ్‌ సైట్లు, పది యాప్‌లు, అలాగే 57 సోషల్‌ మీడియా అకౌంట్లపై కేంద్ర ప్రభుత్వం నిబంధనలు పెట్టింది.

బయట ఓపెన్ గా కనిపించకుండా యాక్సెస్‌ను రిస్టిక్ట్ చేసింది. ఈ విషయంపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పందించి.. నైతిక ప్రమాణాలను పాటించడం, అశ్లీలంగా, అసభ్యంగా భావించే కంటెంట్‌ను ప్రచారం చేయవద్దని, వాటికి దూరంగా ఉండాలని, ఇప్పటికైనా మానుకోవాలని, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.


Similar News