Mamitha Baiju: జాక్ పాట్ కొట్టిన ‘ప్రేమలు’ బ్యూటీ

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన మూవీ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

Update: 2024-08-05 04:04 GMT

దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన మూవీ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకూడా చక్రం తిప్పాలని రీసెంట్ గానే అడుగుపెట్టాడు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విజయ్, వెంకట్ ప్రభు డైరెక్షన్లో ‘ది గోట్’ అనే మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

అజిత్ తో వాలిమై, తునీవు వంటి హిట్ మూవీస్ తెరకెక్కించిన ఈయన.. విజయ్ కోసం ఓ పొలిటికల్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఉంటే ఈ మూవీలో నటించే హీరోయిన్స్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే సమంత, కీర్తి సురేష్ ఫీ నటిస్తున్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. చిత్ర టీం నుంచి మేకర్స్‌ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే, తాజాగా ఈ సినిమాలో ప్రేమలు ఫేం మమితా బైజు కీలక పాత్రలో నటించనుందని తెలిసిన సమాచారం.ఈ మూవీలో ముఖ్య పాత్ర కోసం ఆమెను కాంటాక్ట్ చేసారని అంటున్నారు. కథలో ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉండటంతో దీనికి ఆమె కూడా ఓకే చెప్పిందని టాక్ బాగా వినిపిస్తుంది. ఇదే నిజమైతే ప్రేమలు బ్యూటీ సినీ కెరియర్ మొత్తం మారిపోతుంది.

Tags:    

Similar News