Sudheer Babu:సరికొత్త అవతార్‌లో సుధీర్ బాబు.. షాక్‌లో ఫ్యాన్స్
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు.
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ప్రతి మూవీలో కొత్తదనం చూపించేందుకు తను పడే శ్రమ గురించి తెలిసిందే. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మామా మశ్చీంద్ర’. రీసెంట్‌గా సుధీర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సుధీర్ బాబు లుక్ చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ఆయన హెవీ బాడీ, సరికొత్త గెటప్, ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా బాడీ లాంగ్వేజ్‌తో కనిపించాడు. తెలుగు హీరోల్లో సిక్స్ ప్యాక్ బాడీని ఎక్కువ చిత్రాల్లో మెయింటైన్ చేసిన సుధీర్ ఈ మూవీ కోసం ఇంతలా కష్ట పడుతున్నారంటూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.