టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. కబాలి నిర్మాత అరెస్ట్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు..!

హైదరాబాద్‌కు చెందిన వారికి డ్రగ్స్ ఇవ్వొద్దని గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్న నైజిరియా దేశానికీ చెందిన డ్రగ్ మాఫియా ముఠా తీర్మానం చేసుకున్నారు.

Update: 2023-06-17 04:51 GMT

దిశ, రాచకొండ: హైదరాబాద్‌కు చెందిన వారికి డ్రగ్స్ ఇవ్వొద్దని గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్న నైజిరియా దేశానికి చెందిన డ్రగ్ మాఫియా ముఠా తీర్మానం చేసుకున్నారు. ఇటీవల సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం చేసిన ‘ఆపరేషన్ కబాలి’ డ్రగ్స్ మాఫియాలో ఓ పెద్ద కలకలం రేపింది. దీంతో హైదరాబాద్‌కు డ్రగ్స్ డెలివరీ ఉంటే వెళ్లొద్దని.. హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి డ్రగ్స్ ఇవ్వొద్దని డ్రగ్ మాఫియా సూత్రదారులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారని పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.

వీకెండ్ నిఘాలో భాగంగా డికాయ్ ఆపరేషన్‌కు దిగినప్పుడు పోలీసులకు ఈ విషయం తాజాగా స్పష్టం అయ్యింది. ఇటీవల కబాలి నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ సమయంలో డ్రగ్ వినియోగదారులు పోలీసులతో కలిసి తమ దందా విషయాన్ని బయట పెట్టారని డ్రగ్ మాఫియా గుర్రుగా ఉన్నారు. దీంతోనే హైదరాబాద్‌కు చెందిన వారికి డ్రగ్స్ ఇవ్వొద్దని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

డ్రగ్ కింగపిన్ గ్యాబ్రియల్ గోవాలో గత మూడు ఏండ్లుగా నైజీరియన్ యువకులతో డ్రగ్స్ దందా చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గ్యాబ్రియల్ నైజీరియాలో ఉంటూనే ఈ దందా చేయిస్తున్నాడని సైబరాబాద్ పోలీసులు కనుగొన్నారు. కబాలి నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ దర్యాప్తులో పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. గ్యాబ్రియల్ గోవాలో తన డ్రగ్స్ దందాను విస్తరించేందుకు నైజీరియాకు చెందిన యువతి, యువకులకు టూరిస్ట్, స్టూడెంట్ వీసాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. గోవాలో పోలీసులు గుర్తించకుండా మహిళలు దగ్గర డ్రగ్స్‌ను ఉంచి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

టాలీవుడ్‌లో భయం భయం!

స్పెషల్ ఆపరేషన్‌లో పోలీసులకు చిక్కిన కబాలి మూవీ ప్రొడ్యూసర్ కేపీ చౌదరి టాలీవుడ్‌లోని పలువురికి డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇక పోలీసులు వారికి నోటీసులు ఇచ్చి విచారణ 'క్యూ'లో నిలబెట్టడం తరువాయిగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జీ-20 సమావేశాలు.. రాష్ట్రపతి పర్యటన ఉండడంతో ఈ డ్రగ్స్ కేసు‌ను ఎక్కువగా ప్రచారం కాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆపరేషన్ కబాలి ఇన్వెస్టిగేషన్ జోరు అందుకోనుంది. కొన్ని ఏండ్ల కింద హైదరాబాద్‌లో తొలి డ్రగ్ లింక్‌ను చేధించిన అప్పటి వెస్ట్ జోన్ డీసీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రస్తుత సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉండడంతో ఆపరేషన్ కబాలి ఎంత మంది టాలీవుడ్ పెద్దలకు చుట్టుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది. 

Read More:    ‘Adipurush’ సినిమా ప్రభాస్ కోసం కాకుండా రాముడి కోసం చూడండి.. నాగబాబు కామెంట్స్ వైరల్ (వీడియో) 


Similar News