800 మంది ఆకలి తీర్చి గొప్ప మనసు చాటుకున్న గీతామాధురి భర్త(వీడియో)
బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ.. వెబ్ సిరీస్‌ల్లో, సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు నటుడు నందు.
దిశ, సినిమా: బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ.. వెబ్ సిరీస్‌ల్లో, సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు నటుడు నందు. ఇటీవలే మ్యాన్షన్ 23, వధువు వెబ్ సిరీస్‌ల్లో నటించి ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సిరీస్‌లకు ఓటీటీల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఐపీఎల్ లాంటి ధనాధన్ క్రికెట్ టోర్నమెంట్లలో స్పోర్ట్స్ యాంకర్‌గానూ తన సత్తా ఏంటో నిరూపించుకుంటున్నాడు.
ఇకపోతే నందు.. టాలీవుడ్ స్టార్ సింగర్ గీతా మాధురిని ప్రేమించి.. పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2019 లో దాక్షాయణి అనే కూతురికి జన్మనిచ్చిన వీరు రీసెంట్గా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా నందు.. ఓ మంచి పని చేసి అందరి మనసులు గెల్చుకున్నాడు. 800 మందికి అన్నదానం చేసి వారి ఆకలి తీర్చాడు. శ్రీ విద్యాపీఠంలో అన్నపూర్ణార్చన చేసిన నందు.. 800 మందికి ఫుడ్ అందించారు.
తానే స్వయంగా ఫుడ్ ప్రిపేర్ చేశాడు. తన చేతులతో అందరికీ వడ్డించాడు. అన్నదానం అనంతరం నందునే పాత్రలు కడిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. స్టార్ నటుడు అనే ఎలాంటి ఫీలింగ్ లేకుండా పని చేస్తున్నాడు. గ్రేట్ నందు.. అంటూ ఈ యాక్టర్‌ను నెటిజన్లు పొగుడుతున్నారు.