అసభ్యకరంగా.. కూతురిని మరొకరితో హోటల్‌ రూమ్‌కు పంపించిన నటుడు..

భార్య అలియా గురించి సోషల్ మీడియాలో పెద్ద నోట్ షేర్ చేశాడు నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ.

Update: 2023-03-10 12:07 GMT

దిశ, సినిమా : భార్య అలియా గురించి సోషల్ మీడియాలో పెద్ద నోట్ షేర్ చేశాడు నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. కావాలనే తనను బ్యాడ్‌గా చిత్రీకరిస్తుందని చెప్పుకొచ్చాడు. దీనిపై వెంటనే రియాక్ట్ అయిన ఆమె కూడా నోట్ షేర్ చేసింది. ఇందులో నవాజ్ తనకు తెలియకుండా.. తన కూతురిని మేనేజర్‌తో విదేశాలకు పంపించాడని తెలిపింది. ఇద్దరు ఒకే హోటల్ గదిలో ఉన్నప్పుడు అతను తన బిడ్డను అసభ్యకరంగా టచ్ చేశాడని చెప్పింది.

నవాజ్ ఒక ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్ అని మండిపడింది. అయితే ఇదే టాపిక్‌పై నవాజ్-అలియా మధ్య జరిగిన ఆడియో సంభాషణ లీక్ కావడం విశేషం. ఎందుకు మేనేజర్‌తో కూతురిని విదేశాలకు పంపించావని అలియా అడగ్గా.. అతనిపై నమ్మకముందని, ప్రతీది అనుమానించొద్దని తెలిపాడు నవాజ్. అంతేకాదు తన వర్క్ చూసుకునేది పూర్తిగా మేనేజర్ మాత్రమేనని, అతన్ని నమ్మితే బాగుంటుందని.. లేదంటే పీఎస్‌లో కంప్లయింట్ చేసుకోమని సమాధానమిచ్చాడు.

Also Read..

అతనొక ‘బెస్ట్ ల్యాండ్‌ లార్డ్’.. సతీష్ కౌశిక్‌కు కార్తిక్ భావోద్వేగ నివాళి  

Tags:    

Similar News