మలయాళ సినిమాల్లో రెండేళ్లు నటించక పోవడానికి కారణం అదే: అనుపమ
యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ‘ప్రేమమ్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ కొంత కాలం సినిమాలకు దూరమైంది.
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ‘ప్రేమమ్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ కొంత కాలం సినిమాలకు దూరమైంది. ఇప్పుడు ‘డిజే టిల్లు స్వ్కేర్’తో ప్రేక్షకులను అలరించనుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నాకు కోపం చాలా ఎక్కువ! అఆ లో నాగవల్లిలా అన్నమాట. కోపం వస్తే ఫటాఫట్ అనేస్తా. గట్టిగా అరిచేస్తా! కాసేపు అదే మూడ్‌లో ఉంటా. ఇంకొన్నిసార్లు పూర్తిగా సైలెంట్‌గా ఉండిపోతా. ఓ అరగంటకు మళ్లీ సెట్ అయిపోతా! ఆ విషయాన్ని మళ్లీ ప్రస్తావించను. మలయాళ చిత్రం ‘ప్రేమమ్’లో నాది చిన్నపాత్ర. మహా అయితే పదిహేను నిమిషాల నిడివి ఉంటుందేమో! అయితే, ఆ సినిమా విడుదలయ్యాక నా మీద చాలా ట్రోల్స్ వచ్చాయి.
ఇండస్ట్రీలో అనుభవం లేకపోవడంతో వాటన్నిటినీ చాలా సీరియస్‌గా తీసుకున్నా. చాలా రోజులు డిప్రెషన్‌లో ఉండిపోయా. ఎంతగా అంటే.. మళ్లీ మలయాళ చిత్రాల్లో నటించొద్దని డిసైడ్ అయిపోయా. తర్వాత రెండేండ్లకు గానీ, మళ్లీ మాతృభాషలో సినిమా చేయలేదు. ఇప్పుడు అక్కడ కూడా మంచి ఆదరణ లభిస్తుండడం ఆనందంగా ఉంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్నాళ్లకు సోషల్ మీడియాను ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలుసుకున్నా. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాను. ఇన్‌స్టాలో రెగ్యులర్‌గా వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తుంటాను. అభిమానులను నేరుగా కలిసే అవకాశం ఉండదు కదా! ఆ లోటును సామాజిక మాధ్యమాలు భర్తీ చేస్తాయి. నా సినిమాలు, నా నటనను మెచ్చుకుంటున్న వారికి నా సంతోషాలను షేర్ చేసుకోవడానికి సోషల్ మీడియా సరైన వేదిక అనుకుంటున్నా. 'టిల్లు స్క్వేర్’తో మంచి విజయాన్ని అందుకుంటానన్న నమ్మకం ఉంది’’ అంటూ చెప్పుకొచ్చింది.