Vishwak Sen: ఇన్‌స్టా డియాక్ట్‌వేట్ చేయడానికి కారణం అదే.. అసలు నిజం చెప్పేసిన విశ్వక్ సేన్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రజెంట్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

Update: 2024-07-28 10:50 GMT

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రజెంట్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘గ్యాగ్ ఆఫ్ గోదావరి’ చిత్రంతో మంచి హిట్ అందుకున్న విశ్వక్ ప్రజెంట్.. ‘మెకానిక్ రాకీ’ చిత్రంతో బిజీగా ఉన్నాడు.  మాస్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో ముచ్చటించిన విశ్వక్.. సినిమా అండ్ పర్సనల్ విషయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు విశ్వక్ సేన్.

ఆయన మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో పాటలు చాలా మంచిగా వచ్చాయి. మా సినిమా కోసం జేక్స్ బిజోయ్ అందించిన మ్యూజిక్ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. సినీ పరిశ్రమలో కెరీర్ స్టార్ట్ చేసినప్పటినుంచి ఇక్కడి లెక్కలు నాకు తెలియదు. కానీ ఇతరులకు సపోర్ట్ చెయ్యాలని మాత్రం చూస్తాను. ఇక ఇన్‌స్టా విషయానికి వస్తే.. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండేది ఫ్యాన్స్ కోసం మాత్రమే. కానీ ఎందుకు డియాక్టివేట్ చేశానంటే.. మార్చి 29 నాటికి నాకు 30 ఏళ్లు వస్తాయి. ఇంత వయసు వచ్చిన ఫోన్‌కు ఎక్కువ సమయం కేటాయించడం నాకు నచ్చలేదు. అందుకే ఇక ఫోన్ పక్కన పెట్టి.. పనిమీద దృష్టి పెట్టాలి అనుకున్నాను. అందుకే డియాక్టివేట్ చేశా. సినిమా రిలీజ్‌కు వారం ముందు మళ్లీ యాక్టివేట్ చేస్తా.. తర్వాత మళ్లీ డియాక్టివేట్ చేస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు.  

Tags:    

Similar News