ఆ భయం నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది.. అందుకే అలా చేశాను: సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలిసిందే.

Update: 2024-03-16 09:29 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలిసిందే. ‘ఏం మాయ చేశావే’ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్ముడు.. అనతి కాలంలోనే మంచి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. తర్వాత నాగచైతన్యతో పెళ్లి, విడాకులు, మయోసైటిస్ వ్యాధి ఇలా గత రెండు సంవత్సరాలుగా తీవ్ర డిప్రెషన్‌లో ఉంది సమంత. అంతే కాకుండా తనకు వచ్చిన వ్యాధి కారణంగా సవంత్సరం పాటు సినిమాలకు గ్యాప్ కూడా ఇచ్చింది. ఇక సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అభిమానుతో టచ్‌లోనే ఉంటోంది. ప్రస్తుతం మయోసైటిస్ నుంచి కోలుకున్న సామ్.. ఇన్‌స్టాలో మరింత యాక్టివ్ అవుతూ హెల్త్‌కు సంబంధించిన వీడియోలు సైతం షేర్ చేసుకుంటోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆ భయం నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటోంది అంటూ ఓ పోస్ట్ పెట్టింది సామ్. ‘చాలా పాత్రల్లో ప్రాధాన్యత లేకపోయినా నేను నటించాను. ఎందుకుంటే ప్రతీ పోస్టర్‌పై నేను ఉండాలని అనుకున్నాను కాబట్టి. అనుకున్నట్టే ఉన్నాను. ప్రతీ నెల నాదొక సినిమా రిలీజ్ ఉండేది. అలాంటప్పుడు మీరు నన్ను పట్టించుకోకుండా ఉండలేరు. హీరోయిన్ అంటే కెరీర్ లైఫ్ తక్కువగా ఉంటుందని ఫిక్స్ అయిపోయేలా చేస్తారు. ఎక్కవగా బ్రేక్స్ తీసుకోలేమని అంటారు. కంటికి కనిపించకపోతే ప్రేక్షకులు మమ్మల్ని మర్చిపోతారని అంటారు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను మంచి ప్రాజెక్ట్ వచ్చేవరకు ఎదురుచూస్తాను. సంవత్సరం పాటు బ్రేక్ తీసుకున్నారు అని చెప్పడం సులభమే. కానీ, ప్రేక్షకుల కంటికి కనిపించకపోతే నన్ను మర్చిపోతారేమో అన్న భయం నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటోంది’ అంటూ చెప్పుకొచ్చింది. 


Similar News