అదిరిపోయిందిగా.. టిల్లు స్క్వేర్ లో అనుపమతో పాటు ఆ బ్యూటీ కూడా!
టిల్లు అన్న డీజే పెడితే అంటూ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ. ఆయన డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఎలాంటి అంచానాలు లేకుండా రిలీజైన ఈ
దిశ, సినిమా : టిల్లు అన్న డీజే పెడితే అంటూ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ. ఆయన డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఎలాంటి అంచానాలు లేకుండా రిలీజైన ఈ మూవీ ఊహించని విధంగా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో సిద్దు బాడీ లాంగ్వేజ్, కామెడీ, నేహా శెట్టి రొమాంన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా ఈ మూవీలోని టైటిల్ సాంగ్ మరింత క్రేజ్ తీసుకొచ్చింది. దీంతో మూవీకి సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ రాబోతుంది. ఇక ఇప్పటి వరకు ఏ సినిమాలో కనిపించని విధంగా అనుపమ రొమాంటిక్ యాంగిల్‌లో కనిపించబోతుంది.
కాగా, మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేమిటంటే? టిల్లు స్వ్కేర్‌లో నేహా శెట్టి కూడా కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. డీజే టిల్లు సినిమాలో రాధికాగా తన నటనతో అందంతో కట్టిపడేసిన నేహా శెట్టి ఇప్పుడు టిల్లు స్క్వేర్ లోనూ కనిపించనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ అమ్మడు చిన్న క్యామియో ఇస్తుందని అంటున్నారు నెటిజన్స్. మరి ఇందులో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.