ఆ నటుడు నన్ను చంపడానికి ప్రయత్నించాడు: అంజలి
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు, మహిళా క్యారెక్టర్ ఆర్టిస్ట్లు లైంగిక వేధింపులు ఎదుర్కోవడం చూస్తూనే ఉన్నాం.
దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు, మహిళా క్యారెక్టర్ ఆర్టిస్ట్లు లైంగిక వేధింపులు ఎదుర్కోవడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ప్రముఖ నటి అంజలి నాయర్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి నాయర్.. ఓ నటుడి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పింది.
'నాకు మలయాళంతో తమిళ్ కూడా బాగా వచ్చు. దీంతో కెరీర్ ఆరంభంలో తమిళ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపించాను. పలు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే నేను నటించిన తొలి తమిళ చిత్రంతోనే వేధింపులు మొదలయ్యాయి. ఓ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన వ్యక్తి నన్ను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టాడు. ఈ మూవీకి కో ప్రొడ్యూసర్ కూడా అతనే. షూటింగ్ అయిపోయాక కూడా నన్ను సెట్స్ నుంచి వెళ్లనిచ్చేవాడు కాదు. చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడు. ప్రేమిస్తున్నాను అంటూ చాలా వేధించాడు. ఒకసారి నన్ను రైలులో నుంచి తోసి చంపేందుకు కూడా ప్రయత్నించాడు' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.