Thangalaan: కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది: జీవీ ప్రకాష్ కుమార్

తమిళ కథానాయకుడు విక్రమ్‌ హీరోగా నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'తంగలాన్‌'.

Update: 2024-08-13 15:08 GMT

దిశ, సినిమా: తమిళ కథానాయకుడు విక్రమ్‌ హీరోగా నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'తంగలాన్‌'. పాన్‌ ఇండియా చిత్రంగా దర్శకుడు పా రంజిత్‌ ఈ చిత్రాన్ని రూపొందించాడు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాత. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో రియల్‌ ఇన్‌సిడెంట్స్‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న ప్రపంచవ్యాప్తంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమాకు మ్యూజిక్ అందించిన జీవీ ప్రకాష్ కుమార్ మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు ఆయన మాట్లాడుతూ 'ఈ సినిమాకు సంగీతం అందించడం చాలా ఎగ్జైటింగ్ అనిపించింది.ఈ కథ విన్నప్పుడు ఎలాంటి సంగీతం ఈ కథకు సెట్‌ అవుతుందనేది నాకు ఐడియా వచ్చింది. ట్రైబల్ నేపథ్యంగా ప్రీ ఇండిపెండెన్స్ టైమ్ లో జరిగే స్టోరీ ఇది.

కొంత రీసెర్చ్‌ చేసి ట్యూన్స్‌ మొదలుపెట్టాను. అయితే ఇలాంటి కథకు ఆధునిక సంగీతం సెట్‌ అవ్వదు. ఆ కథా నేపథ్యానికి తగ్గట్టుగా మ్యూజిక్‌ను అందించాను. ‘తంగలాన్’ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. ఈ సినిమాను బిగ్‌స్క్రీన్‌పై చూసేందుకు ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా చూసిన వారంతా కొత్త అనుభూతికి లోనవుతారు అని మాత్రం చెప్పగలను. చాలా తక్కువ సమయంలో మ్యూజిక్‌ అందించాల్సి వచ్చింది. ఇది నాకు ఓ ఛాలెంజింగ్‌గా అనిపించింది. అయితే దర్శకుడు పా రంజిత్‌ చాలా క్లారిటీగా వివరించడంతో అందుకు తగిన సంగీతం చేశాను. ఈ సినిమాకు పనిచేయడం నాకు గొప్ప సంతృప్తినిచ్చింది. తెలుగులో దుల్కర్ హీరోగా నటిస్తున్న లక్కీ భాస్కర్, నితిన్ హీరోగా చేస్తున్న రాబిన్ హుడ్ తో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నాను. వీటిఇతో దిల్ రాజు గారితో, వైజయంతీ బ్యానర్స్ లో మూవీస్ చేయాల్సిఉంది. తమిళంలో ధనుష్, శివకార్తికేయన్ అమరన్ తో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నాను. నటుడిగా,ర సంగీత దర్శకుడిగా టైమ్‌ బ్యాలెన్స్‌ చేస్తూ నా ప్రయారిటీస్‌ తగ్గట్టుగా నా కెరీర్‌ను ప్లాన్‌ చేసుకుంటున్నాను' అన్నారు.

Tags:    

Similar News