అయ్యయ్యో.. మళ్లీ దొరికేసిన థమన్.. జరగండి పాట కూడా కాపీనేనా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా గేమ్ ఛేంజర్ మూవీ నుంచి జరగండి సాంగ్ రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. థమన్ స్వరపరిచిన ఈ పాటకు శ్రీరామ్ సాహిత్యం

Update: 2024-03-27 13:57 GMT

దిశ, సినిమా : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా గేమ్ ఛేంజర్ మూవీ నుంచి జరగండి సాంగ్ రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. థమన్ స్వరపరిచిన ఈ పాటకు శ్రీరామ్ సాహిత్యం అందించారు. కాగా, ఈ పాట విడుదలైన కొద్ది నిమిషాల్లోనే థమన్ పై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. అయ్యయ్యో థమన్ రామ్ చరణ్ సినిమాకు, ఎన్టీఆర్ సాంగ్ కాపీ కొట్టావా అంటూ నెట్టింట తెగ ట్రోల్ చేస్తున్నారు.

అయితే, ఎన్టీఆర్ సినిమాల్లో మంచి హిట్ అందుకున్న మూవీస్‌లో శక్తి సినిమా ఒకటి. ఈ మూవీలో సుర్రో.. సుర్రో అనే పాట ఇప్పటికీ చాలా మంది వింటూ ఉంటారు. కాగా, ఈ పాటను తమన్ కాపీ కొట్టారంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన జరగండి సాంగ్ ఎక్కడో విన్నట్లు అనిపించింది. దొరికేశావ్ తమన్.. కాపీ కొట్టావు అంటూ రెండు సినిమాలోని సాంగ్స్ క్లిప్స్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక థమన్ నుంచి కొత్త సాంగ్ వచ్చిన ప్రతి సారి ట్రోలింగ్ జరగడం అనేది కామన్ అయిపోయింది.


Similar News