చంద్రమోహన్‌ గురించి.. ఆసక్తికరమైన విషయాలు పంచుకున్న టీజీ వెంకటేష్

టాలీవుడ్ సీనియర్ హీరో, నటుడు చంద్రమోహన్ శనివారం కన్నమూశారు

Update: 2023-11-12 06:48 GMT

దిశ,వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో, నటుడు చంద్రమోహన్ శనివారం కన్నమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన మృతి చెందారు. ఆయన మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా అందరూ కూడా చంద్ర మోహన్ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు వేశారు.

చంద్ర మోహన్‌తో తనకున్న పరిచయాన్ని తాజాగా ప్రముఖ రాజకీయ వేత్త టీజీ వెంకటేష్ పంచుకున్నారు. చంద్రమోహన్‌లోని ఇంకో కోణాన్ని అందరికీ చూపించారు. ఆయన.. ఎంతటి సేవా గుణం కలవాడన్నది అందరికీ తెలిసేలా చేశారు. సినీ ఆర్టిస్ట్ చంద్రమోహన్‌తో అనుబంధం మరువలేనిది అని ఆయన అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా చంద్రమోహన్‌కు, ఆయన సభ్యులకు పారితోషకం ఇస్తుంటే.. ఆయన వద్దని చెప్తూ, ‘విద్యార్థులు మీరు మంచి కార్యక్రమానికి పూనుకున్నారు. నేను పారితోషకం తీసుకోకపోవడమే మీకు చేస్తున్న ఆర్థిక సహాయం’ అని చెప్పి చంద్ర మోహన్ తన గొప్ప మనసును చాటుకున్నారని ఆయన తెలిపారు. 

Tags:    

Similar News