తెలుగమ్మాయిలు సినిమాల్లోకి రండి: అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు

పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

Update: 2023-07-21 11:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన ‘బేబీ’ చిత్రాన్ని అభినందించడానికి స్వయంగా తానే ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేసి ఆ చిత్ర బృందాన్ని పొగిడారు బన్నీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో వైష్ణవి, ‘అలవైకుంఠపురంలో’ మూవీలో నా చెల్లెలి పాత్రలో అద్భుతంగా నటించింది. బేబీ చిత్రంలో కూడా చాలా బాగా చేసింది. తెలుగు అమ్మాయి హీరోయిన్ అవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ తెలుగు అమ్మాయిలు వచ్చి సినిమాలు చేయ్యట్లేదు. ఏదైనా అవార్డు కార్యక్రమానికి వెళ్తే మలయాళం, తమిళం, కన్నడ హీరోయిన్సే అవార్డులు తీసుకుంటున్నారు.

ఇతర భాషల హీరోయిన్స్ తెలుగు మూవీ కోసం అవార్డ్స్ దక్కించుకుంటున్నారు కానీ.. ఒక్క తెలుగు అమ్మాయి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి లేదు. ఈ బాధ నాకు ఎప్పటినుంచో ఉంది. అమ్మాయిలు భయపడనవసరం లేదు. మీ తల్లిదండ్రులను ఒప్పించి పరిశ్రమకు వచ్చి సినిమాలు చేయ్యండి. ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయంటూ బన్నీ చెప్పుకొచ్చారు. అలాగే వైష్ణవి స్టార్‌గా రాణించాలి. బెస్ట్ యాక్టర్‌గా అవార్డు సంపాదించుకోవాలి. తెలుగు అమ్మాయిలకు ఇన్సిరేషన్‌గా నిలవాలి. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు ఎక్కువగా డిమాండ్ ఉంది అంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Read more : disha newspaper

Movie News & Gossips

Tags:    

Similar News