20 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌..!!

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(Telugu Film Journalists Association)సభ్యుల సంక్షేమం నిరంతరం కృషి చేస్తోన్న సంఘం

Update: 2024-03-24 03:54 GMT

దిశ, సినిమా: తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(Telugu Film Journalists Association)సభ్యుల సంక్షేమం నిరంతరం కృషి చేస్తోన్న సంఘం. ఈ ఏడాదితో అసోషియేషన్ రెండు దశాబ్దాలను కంప్లీట్ చేసుకుంది. కాగా ఈ సంవత్సరం వరకు సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డులతో పాటు, హెల్త్ కార్డ్స్ ను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, స్టార్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు, విజయ్ దేవరకొండ, ఆర్‌.నారాయణమూర్తి, టీఎఫ్‌జెఎ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, జనరల్ సెక్రటరీ వై. జె. రాంబాబు, ట్రెజరర్ సురేంద్ర నాయుడు పాటు అసోసియేషన్ సభ్యులు.. తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా TFJA ట్రెజరర్ సురేంద్ర నాయుడు మాట్లాడుతూ.. ‘‘విజయవంతంగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నామని అన్నారు. మనం ఒక యూనిటీగా కలిసి మెలసి పని చేయడం ద్వారానే ఇంతవరకు రాగలిగామని, మనం ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని తెలిపారు. టీఎఫ్‌జేఏకి వెన్నంటు ఉంటూ మనల్ని నడిపిస్తున్న మెగాస్టార్ చిరంజీవికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానని, ఇప్పుడు 181 మంది సభ్యులం ఉన్నాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి 481 మంది ఉన్నామని పేర్కొన్నారు. కరోనా సమయంలో మెగాస్టార్ మన అసోసియేషన్‌కు యోధా డయోగ్నస్టిక్స్ ద్వారా 50 శాతం వెసులుబాటు కల్పించారని మరోసారి గుర్తుచేశారు. ఈ సదుపాయాన్ని తల్లిదండ్రులకు కూడా అందజేశారని అన్నారు. ఇవాళ మెడికల్ ఇన్య్సూరెన్స్ ప్రతి వ్యక్తికీ 10 లక్షలను అందిస్తున్నామని, అందులో 5 లక్షల మందికి, 5 లక్షలు ఫ్యామిలీకి ఇస్తున్నాం.

ఇందులో సగం మెంబర్ కట్టుకుంటే, సగం అసోసియేషన్ భరిస్తోందని వెల్లడించారు. అంతేకాకుండా టర్మ్ పాలసీ ప్రతి సభ్యుడికీ 15 లక్షలు ప్రతి సంవత్సరానికి అందజేస్తున్నామని అన్నారు. ఎవరికీ ఏమీ జరగకూడదని కోరుకుందామని’’ చెప్పుకొచ్చారు. తర్వాత టీఎఫ్‌జేఏ ప్రెసిడెంట్ వారణాసి లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అంటే ఒక యూనిటీ. హెల్త్ కు సంబంధించి అందరికీ ఓ భరోసా కల్పించాలన్నదే ఈ సంస్థ ఏర్పడటానికి ప్రధాన కారణం. త్వరలో మన ఎయిమ్ హౌసింగ్‌, హౌసింగ్ మెంబర్‌షిప్‌కి అందరికీ ఆహ్వానం అందుతుంది. ఇన్ని సంవత్సరాలుగా మన అసోసియేషన్ కు ఫినాన్షియల్ గా హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని వెల్లడించారు.

అనంతరం మీడియా అకాడమీ చెర్మైన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ‘మనం ఎప్పుడు ప్రజల పక్షాన పని చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 23 వేల మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉన్నారని, ప్రతి కంపెనీలో ఫిల్మ్ జర్నలిస్టులకు స్పెషల్ అక్రిడేషన్ ఇచ్చేలా చూశామని తెలిపారు. గత ఏడాది వీరికి ఇళ్లు కట్టుకోవడానికి స్థలాలు ఇస్తామని ప్రభుత్వం ఆశ పెట్టిందని, కానీ ఆ కళ నేరవేరలేదని, ఇప్పటికి ప్రభుత్వం ఇస్తుందని ఆశతో ఉన్నారని.. ఎలిజిబుల్ పీపుల్స్ కు తప్పకుండా ఇప్పించే ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు.

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘హెల్త్ కార్డుల సెలబ్రేషన్స్‌లో పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా ఉందని, జర్నలిస్టులకు శ్రీనివాసరెడ్డిగారు ల్యాండ్‌లు ఇప్పిస్తే అందరూ సంతోషంగా ఉంటారని తెలిపాడు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతుంటే నేను చాలా విషయాలు తెలుసుకున్నానని, ఆయన చాలా స్ట్రాంగ్ గైడ్ అనిపిస్తోందని అన్నాడు. నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు మెడికల్ బిల్లులు ఎక్కువ వస్తాయేమోనని భయపడి హెల్త్ ఇన్‌స్యూరెన్స్ లు తీసుకునేవాడినని తెలిపాడు. వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా విజయ్ కు తెలిసేది కాదని. కొన్నిసార్లు రెన్యువల్‌కు డబ్బులు ఉండేవి కాదని, అలా ఎన్నిటినో వదిలేశానని, ఇప్పుడు ఈ అసోసియేషన్ ద్వారా అందరూ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని తెలిసి చాలా సంతోషంగా అనిపించిందని వెల్లడించారు. అలాగే జీవితంలో ఎవరికైనా మూడే ముఖ్యం. ఒకటి ఆరోగ్యం, రెండు ఆనందం, మూడు డబ్బు అని టాలీవుడ్ హీరో విజయ్ చెప్పుకొచ్చాడు.


Similar News