Vishnu Priya: బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం..
బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గురువారం ఆమె తల్లి మృతి చెందింది..
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గురువారం ఆమె తల్లి మృతి చెందింది. ఈ విషయాన్ని స్వయంగా విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. ఈ సందర్భంగా తన తల్లితో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ''మై డియర్ అమ్మ.. ఈ రోజు వరకు నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తాను. నువ్వు నా బలం, నువ్వే నా బలహీనత. ప్రస్తుతం నువ్వు ఈ అనంత విశ్వంలో కలిసిపోయావు. నువ్వు ప్రతిచోట, నా ప్రతి శ్వాసలో ఉంటావని నాకు తెలుసు. ఈ భూమి మీద నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు. అందుకు నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా..'' అంటూ విష్ణుప్రియ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దీంతో బుల్లితెర కమేడియన్లు, యాంకర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా విష్ణుప్రియ యాంకరింగ్‌తో పాటు ఇటీవల విడుదలైన సినిమా 'వాంటెడ్ పండుగాడు'లో హీరోయిన్గా నటించింది.
ఇవి కూడా చదవండి: టాలీవుడ్లో మరో విషాదం.. సీనియర్ నటి జమున కన్నుమూత