డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. ప్రియుడిని పెళ్లాడిన స్టార్ నటి..!!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిజజాలు మోగుతున్నాయి. వెండితెర, బుల్లితెర నటీనటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర రంగాలకు చెందిన వారు వరుస వివాహాలు చేసుకుంటున్నారు.
దిశ, సినిమా: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిజజాలు మోగుతున్నాయి. వెండితెర, బుల్లితెర నటీనటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర రంగాలకు చెందిన వారు వరుస వివాహాలు చేసుకుంటున్నారు. కొంతమంది పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకోగా.. మరికొంతమంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. రీసెంట్ గా బుల్లితెర నటి ట్వింకిల్ వశిష్ట్ తన ప్రియుడిని మార్చి 12 వ తేదీన పెళ్లాడింది. గతేడాది వీరిద్దరు అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.
కాగా.. ట్వింకిల్ తాను కోరుకున్న ప్రియుడు హర్హ్ తులిని పెళ్లాడిని సంతోషంలో.. ‘‘మా ప్రేమ ప్రయాణంలో ఎన్నో బ్రేకప్ లు, ఎత్తు పల్లాలు, ఇతర ఎత్తిపొడుపు మాటలు తట్టుకుని ఎదురించి ఈ రోజు మా ప్రేమ నిజమని నిరూపించుకున్నాం. మా పెళ్లిపై చాలామంది చాలా రకాలుగా రూమర్స్ క్రియేట్ చేశారు. ఎంతో మంది మా ప్రేమ శాశ్వతం కాదన్నారు. చివరకు మా జంటను విడగొట్టేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. కొన్ని సార్లు ఇద్దరం డిప్రెషన్ లోకి వెళ్లే సిచ్యువేషన్ వచ్చింది. కానీ ఓపిక, నమ్మకం, కమిట్ మెంట్ అన్న పదాలకు అసలైన అర్థాలు తెలుసుకున్నాం.
ప్రేమకు ఎవరు అడ్డు కాదని నిరూపించాం. నా స్నేహితులు కూడా మా రిలేషన్ ను నమ్మలేదు. కానీ ఎంత పెద్ద గొడవ జరిగినా.. మళ్లీ కలిసేవాళ్లం. నేను అరిచినా ఆయన మాత్రం మెచ్యూర్ గా థింక్ చేసేవారు. ఇలాంటి పార్టర్ దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఐ లవ్ యూ’’ అంటూ ట్వింకిల్ వశిష్ట్ తన ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. ఇక వీరిద్దరు ఆరేళ్ల క్రితం డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ భామ కుండలీ భాగ్య అనే సీరియల్ లో నటిస్తుంది.