బిగ్ బాస్ నుంచి బయటకు రావడంతోనే.. ఆత్మహత్యకు ప్రయత్నించిన కంటెస్టెంట్

సపోర్టింగ్ యాక్ట్రెస్ తేజస్వి మడివాడ సోషల్ మీడియా అబ్యూజింగ్ గురించి తాజాగా ఓ పోడ్ ‌కాస్ట్‌లో మాట్లాడింది.

Update: 2023-09-24 11:42 GMT

దిశ, సినిమా : సపోర్టింగ్ యాక్ట్రెస్ తేజస్వి మడివాడ సోషల్ మీడియా అబ్యూజింగ్ గురించి తాజాగా ఓ పోడ్ ‌కాస్ట్‌లో మాట్లాడింది. బిగ్ బాస్ షో చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో తనపై కొందరు చేసిన కామెంట్స్‌ దారుణంగా ఎఫెక్ట్ చూపాయని.. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు తెలిపింది. బయటకు వెళ్లాలంటే భయమేసేదని.. ఇన్ని విమర్శలు తట్టుకోలేక పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామనుకున్నట్లు చెప్పింది. కానీ కొందరు ఇడియట్స్ చేసే కామెంట్స్ వల్ల తానెందుకు మారాలని అనుకున్నట్లు తెలిపింది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా అబ్యూజింగ్ పట్టించుకోనని.. ఒకవేళ కన్సిడర్ చేస్తే కచ్చితంగా సఫర్ కావాల్సి వస్తుందని అభిప్రాయపడింది.

Tags:    

Similar News