ప్రియుడితో నటి సీక్రెట్ ఎంగేజ్‌మెంట్.. సిగ్గు లేదంటున్న జనాలు

దిశ, సినిమా : యంగ్ సెన్సేషన్ తేజస్వి ప్రకాశ్ తన ఎంగేజ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చింది. Latest Telugu News

Update: 2022-09-11 13:57 GMT

దిశ, సినిమా : యంగ్ సెన్సేషన్ తేజస్వి ప్రకాశ్ తన ఎంగేజ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చింది. కొంతకాలంగా నటుడు కరణ్ కుంద్రాతో డేటింగ్ చేస్తున్న ఆమె ప్రియుడితో నిశ్చితార్థం జరిగిందనే పుకార్లను కొట్టిపారేసింది. విషయానికొస్తే.. చేతికి సాలిటైర్ ఉంగరాన్ని తొడుక్కొని తాజాగా ఫొటోలకు పోజులిచ్చిన నటి 'బిగ్ డే' క్యాప్షన్‌తో నెట్టింట పోస్ట్ చేసింది. ఇక ఈ పిక్స్ వైరల్ కావడంతో తేజస్వి సీక్రెగ్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుందంటూ నెటిజన్లు రూమర్స్ క్రియేట్ చేశారు.

దీంతో ఒక్కసారిగా షాకైన బ్యూటీ.. తామింకా నిశ్చితార్థం చేసుకోలేదని, ఇది కేవలం ప్రచార పోస్ట్ మాత్రమేనని చెప్పింది. ఈ మేరకు ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారని ఫ్యాన్స్ ప్రశ్నించగా.. శుభవార్త చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రైవేట్ విషయంగా భావించి చెప్పలేనని, ఆ రోజు గురించి క్లారిటీ కావాలంటే కరణ్‌ను అడగండని ఆన్సర్ చెప్పకుండా దాటవేసింది. అయితే ఈ తతంగంపై స్పందిస్తు్న్న నెటిజన్లు.. 'మీ ఓవర్ యాక్షన్ ఆపండి. ఇలాంటి పనికిమాలిన స్టంట్స్ చేయడానికి సిగ్గు అనిపించదా! మీరు ఎప్పటికీ మారరు' అంటూ ఫైర్ అవుతున్నారు.

Tags:    

Similar News