బ్రేకింగ్: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!
నటుడు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆహారం తీసుకోకపోవడంతో అలేఖ్య రెడ్డి నీరసించిపోయి అస్వస్థతకు లోనైనట్లు సమాచారం.
దిశ, వెబ్డెస్క్: నటుడు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆహారం తీసుకోకపోవడంతో అలేఖ్య రెడ్డి నీరసించిపోయి అస్వస్థతకు లోనైనట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాగా, భర్త తారకరత్న మృతితో తీవ్ర విషాదంలో కూరుకుపోయిన అలేఖ్య రెడ్డి.. రాత్రి నుండి ఆహరం తీసుకోకుండా భర్త పార్థివ దేహం వద్దే రోదిస్తూ కూర్చున్నారు.
దీంతోనే ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కాగా, గత నెల 27వ తేదీన గుండె పోటుకు గురైన తారకరత్న.. చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో శనివారం రాత్రి మృతి చెందారు. దీంతో తారకరత్న భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్ మోకిలలో ఉన్న అతడి నివాసానికి తరలించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు మోకిలలోని నివాసానికి వెళ్లి తారకరత్న పార్థివ దేహానికి నివాళులు ఆర్పి్స్తున్నారు.