క్రిటికల్‌గా తారకరత్న హెల్త్ కండిషన్.. ఎక్మో అమర్చి వైద్యం..?
లోకేష్ పాదయాత్రలో తీవ్ర అస్వస్థతకు గురైన నటుడు నందమూరి తారకరత్నను కుప్పంలోని పీఈఎస్ ఆసుపత్రి నుండి మెరుగైన వైద్యం కోసం శనివారం అర్థరాత్రి 2.30 గంటలకు బెంగళూరుకు తరలించారు.
దిశ, వెబ్‌డెస్క్: లోకేష్ పాదయాత్రలో తీవ్ర అస్వస్థతకు గురైన నటుడు నందమూరి తారకరత్నను కుప్పంలోని పీఈఎస్ ఆసుపత్రి నుండి మెరుగైన వైద్యం కోసం శనివారం అర్థరాత్రి 2.30 గంటలకు బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకతర్నకు నిపుణుల వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు. అయితే, తారకరత్న రక్త ప్రసరణ నాళాల్లో 90 శాతం బ్లాక్స్ ఉండటంతో స్టెంట్లు వేసిన డాక్టర్లు.. ఎక్మో అమర్చి వైద్యం అందిస్తున్నారు. రక్త ప్రసరణ నాళాల్లో బ్లాక్స్ ఎక్కువగా ఉండటంతో శరీర భాగాలకు రక్త ప్రసరణ జరగడం కోసం ఎక్మో అమర్చి ట్రీట్ మెంట్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, బాబాయ్ బాలకృష్ణ బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఉన్నారు. అయితే, గుండె, ఊపిరితిత్తులు పని చేయని సమయంలో ఎక్మో ద్వారా చికిత్స అందిస్తారని.. ఎక్మో ట్రీట్ మెంట్‌లో సక్సెస్ రేట్ చాలా తక్కువ అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
Read more:
Nara Lokesh Padayatra Yuva Galam live Day -2 | Nara Lokesh Padayatra Yuva Galam live