వరల్డ్ రికార్డు సృష్టించిన తారకరత్న.. ఇప్పటికీ ఆయన పేరుమీదే!
గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు.
దిశ, వెబ్‌డెస్క్: గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. 23 రోజుల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన 'యువగళం' పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో తీవ్ర దు:ఖంలో మునిగిన సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు ఇండస్ట్రీలో తారకరత్న నటించిన సినిమాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఈ క్రమంలో హీరోగా ఆయన క్రియేట్ చేసిన ప్రపంచ రికార్డు ప్రస్తావన తెరమీదకు వచ్చింది.
నందమూరి కుటుంబమే కాదు, ఇండియాలో ఏ హీరో అందుకోని విజయం తారకరత్న సొంతం. ఇండస్ట్రీకి ఎవరైనా ఒక సినిమాతో ఎంట్రీ ఇస్తారు.. లేదంటే రెండు సినిమాలతో వస్తారు. కానీ ఒకేసారి 9 సినిమాలతో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన హీరో నందమూరి తారకరత్న. అప్పట్లో ఇదో పెద్ద సంచలనం. ఒకటి రెండు కాదు ఏకంగా 9 సినిమాల షూటింగ్ ఒకేరోజు మొదలయ్యాయి. దీంతో తారకరత్న గుండె ధైర్యాన్ని మెచ్చుకుంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు పోస్టులు పెడుతూ.. సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
1.ఆ కోరిక తీరకుండా తారకరత్న కన్నుమూయడం బాధాకరం: పవన్ కల్యాణ్