కర్మ ప్రకారమే ఇలా జరిగిందంటూ .. సమంతపై తమిళ నిర్మాత షాకింగ్ కామెంట్స్
వరుస సినిమాలతో అలరిస్తున్న టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి పరిచయం అక్కర్లేదు.
దివ, వెబ్‌డెస్క్: వరుస సినిమాలతో అలరిస్తున్న టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో తరచూ తన వ్యక్తిగత, వృత్తిపర విషయాల గురించి పంచుకుంటూనే ఉంటుంది. అయితే సమంత రెండేళ్ల క్రితం ‘డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్’ పతాకంపై ఓ బైలింగ్వల్ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన అప్డేట్ ఇప్పటి వరకు రాలేదు. కానీ ఇప్పుడు సమంత స్థానంలో రష్మిక మందన్నా వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా రష్మిక మీడియాతో ఆ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ.. ఈ విషయాన్ని బయటపెట్టింది. ‘తను తొలిసారిగా తీస్తున్న లేడిఓరియెంటేడ్ చిత్రమని, ఈ చిత్రాన్ని ఒక ఫిక్షనల్ లవ్ డ్రామాగా రూపొందిస్తున్నామని, దీనికి ‘రెయిన్బో’ అనే టైటిల్‌ను కూడా పెట్టామని, ఈ మూవీలో చాలా కొత్త అంశాలు, థ్రిల్లింగ్ సీన్స్, ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.’
లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దేవ్ మోహన్ జంటగా రష్మిక నటిస్తున్న ఈ చిత్రానిక తమిళ దర్శకుడు శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ త్రీ (ఈ రోజు)న అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించారు. అయితే సమంత ప్లేస్‌లో రష్మిక రావడం ఏంటి? అని నెటిజన్ల లో ఆసక్తి ఇంకా పెరిగింది. అసలు ఏం జరిగుంటుంది అంటూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఇదే ప్రశ్న తాజాగా రెయిన్బో ‘నిర్మాత ఎస్ఆర్ ప్రభుని’ మీడియా ప్రశ్నించడంతో, ఆయన స్పందించి.. మంచి స్క్రిట్లు, క్రియేటర్స్ రైట్ ప్లేస్‌లో రైట్ పర్సన్‌ని ఎంపిక చేసుకుంటాయి. కనుక మేము అదే నమ్ముతాం. ఫ్లోని మేం మార్చాలనుకోవడం లేదు. కంటెంట్, కర్మ అలా జరుగుతూనే ఉంటాయి. వాటిని ఎవరూ మార్చలేరు’’ అంటూ చెప్పారు. అంటే నిర్మాత దృష్టిలో ఈ స్ట్రిప్ట్కు సమంత కరెక్ట్ పర్సన్ కాదా? అని సమంత ఫ్యాన్స్ నిర్మాతను ప్రశ్నిస్తున్నారు.
కర్మ వల్ల అలా జరుగుతుంటాయని నిర్మాత నవ్వుతూ చెప్పినా, ఆయన వాడిన పదజాలం మాత్రం చాలా ఘాటుగా ఉండడంతో ప్రభు మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అదోక హాట్ టాపిక్ గా మారింది. అయితే సమంత ఈ ప్రాజెక్ట్ చేసినప్పటికే నాగచైతన్యతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమె అనారోగ్యానికి గురయ్యింది. సమంత కోసం టీమ్ కొన్ని రోజుల పాటు వెయిట్ చేసిందట. అనంతరం రష్మికను ఎంపిక చేశారని, మరో వైపు సామ్ బిజీగా ఉండడం వల్ల రష్మికని తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read..
సమంతను పెళ్లి గెటప్‌లో చూసేసరికి ఏడ్చేశాను.. శోభిత ధూళిపాళ్ల పోస్ట్ వైరల్