Demante Colony 2: తెలుగులో తమిళ్ హారర్ థ్రిల్లర్ … ‘డీమాంటే కాలనీ 2’ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్
తెలుగులో తమిళ్ హారర్ థ్రిల్లర్
దిశ, సినిమా: ఈ మధ్య హర్రర్ మూవీస్ బాగా హిట్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రేక్షకులు ఆ సినిమాలనే చుడానికి ఇష్ట పడుతున్నారు. చిన్న మూవీ అయినా స్టోరీ బాగుంటే రెండు, మూడు సార్లు చూడటానికి వెళ్తున్నారు. చాలా మంది దెయ్యాలను సినిమాలను లైక్ చేస్తారు. తాజాగా తమిళంలో హిట్ అయినా ‘డీమాంటే కాలనీ’ సీక్వెల్ గా వచ్చిన మూవీ ‘డిమాంటే కాలనీ 2’ రికార్డ్స్ బ్రేక్ చేసింది.
భారీ అంచనాలతో ఆగస్టు 15న తమిళంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమాలో అరుల్‌నిధి, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా నటించారు. తంగలాన్ వంటి పెద్ద సినిమాతో పోటీ పడి మంచి వసూళ్లను రాబడుతోంది. రాజ్ వర్మ ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ బాలాజీ ఫిలిమ్స్, జ్ఞానముత్తు పట్టరై, వైట్ నైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై విజయ సుబ్రహ్మణ్యం, ఆర్‌సి రాజ్‌కుమార్ కలిసి ఈ సినిమాని నిర్మించారు. అజయ్ ఆర్ జ్ఞానముత్తు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
అయితే, తాజాగా ఈ సినిమాని తెలుగులో విడుదల చేయాలని రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే, ఆగస్టు 23న తెలుగులో రిలీజ్ చేయనున్నారని తెలిపారు. ఇప్పటికే రిలీజ్ అయినా తెలుగు ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. హారర్ మూవీస్ ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చుతుంది.