రూమ్‌కు రమ్మంది.. ఆ రాత్రికి రాత్రే అంతా అయిపోయింది.. కానీ మరో వ్యక్తి.. స్టార్ హీరోయిన్‌పై హీరో షాకింగ్ కామెంట్స్?

జాగా సీనియర్ హీరోయిన్ లక్ష్మి మాజీ భర్త.. తమిళ నటుడు మోహన్ శర్మ లక్ష్మి పై సంచలన కామెంట్స్ చేశాడు

Update: 2024-03-13 15:17 GMT

దిశ, సినిమా: తాజాగా సీనియర్ హీరోయిన్ లక్ష్మి మాజీ భర్త.. తమిళ నటుడు మోహన్ శర్మ లక్ష్మి పై సంచలన కామెంట్స్ చేశాడు. ‘‘ ఒకసారి లక్ష్మి, నేను సెంట్ కొనాలని షాప్ కు వెళ్లాం. 500 రూపాయలు పెట్టి సెంట్ కొన్నది. తర్వాత నీ లైఫ్ లోకి ఆహ్వానిస్తే జీవితాంతం కుక్కలా నీ వెంటే ఉంటానని నాతోనే చెప్పింది. తన మాటలు విని నేను ఆశ్యర్యపోయాను. అప్పుడు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. తనే మనమిద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగింది. ఇప్పుడిప్పుడే కెరీర్ పై దృష్టి పెడుతున్నానని.. పెళ్లి ఆలోచన ఇప్పుడేం లేదని చెప్పాను. తర్వాత కాల్ చేసి ఆమె రూమ్ కు రమ్మంది. నేను వెంటనే లక్ష్మి ఉన్న హోటల్ కు వెళ్లాను.

తనకు నుదుటపై కుంకుమ బొట్టు పెట్టాను. ఆ రాత్రికి రాత్రే మేం భార్య భర్తలమయ్యాం. తర్వాత చెన్నైకు వచ్చి.. లాయర్ ద్వారా మా వివాహం గురించి మీడియాకు తెలియజేశాం. పెళ్లి చేసుకున్నాక మేం తక్కువగా కలిసేవాళ్లం. లక్ష్మి చాలా తప్పులు చేసింది. వాటి అన్నింటి గురించి నేను ఇప్పుడు చెప్పలేనని, ఆమె లైఫ్ లోకి మరో వ్యక్తి వచ్చాడని మోహన్ శర్మ వెల్లడించారు. ప్రస్తుతం మోహన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Similar News