పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తమన్న.. ఇంకా ఆ కోరిక తీరలేదంటోంది
బోల్డ్ బ్యూటీ తమన్నా భాటియా తన ప్రేమ, పెళ్లి, కెరీర్‌కు సంబంధించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న తమన్న తాజాగా నటించిన చిత్రాలు ‘భోళా శంకర్’, ‘జైలర్’ వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ తమన్నా భాటియా తన ప్రేమ, పెళ్లి, కెరీర్‌కు సంబంధించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న తమన్న తాజాగా నటించిన చిత్రాలు ‘భోళా శంకర్’, ‘జైలర్’ వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సందర్భంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న ఆమె మాట్లాడుతూ.. ‘చిరు, రజనీల చిత్రాలు ఒక్కరోజు వ్యవధిలో విడుదల కావడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో ఇదొక స్పెషల్ మూమెంట్. ఇద్దరు సూపర్‌స్టార్స్ సినిమాల్లో భాగం కావడంతో నా కల నిజమైంది. ‘భోళా శంకర్’ తమిళ ‘వేదాళం’కు రీమేక్. అయినా ఇందులో ట్రెండ్‌కు తగ్గట్లు తెలుగు వెర్షన్‌లో మార్పులు చేశారు. నా పాత్రను కూడా కొత్తగా తీర్చిదిద్దారు. ‘జైలర్’లో విభిన్నమైన పాత్రలో కనిపిస్తా. ‘సైరా’ చిరుతో డ్యాన్స్ చేసే అవకాశం మాత్రం రాకపోగా ఇందులో ఆ లోటు తీరింది’ అని చెప్పింది. చివరగా ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించే తీరిక లేదని, ఒకవేళ ఏదైనా ఉంటే తానే స్వయంగా ప్రకటిస్తానన్న బ్యూటీ.. సినిమాలపట్ల అంకితభావంతో పనిచేస్తూ ఇలాగే మరింత ముందుకెళ్తానని వెల్లడించింది.
Read More: Kushi Trailer : సమంత ‘ఖుషి’ ట్రైలర్‌పై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ ట్వీట్