గొప్ప మనసు చాటుకున్న మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌

టాలీవుడ్‌లో ప్రజంట్ జెట్‌ స్పీడ్‌లో దూసుకెళుతున్నాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్. ఒకవైపు సినిమాలకు పనిచేస్తూనే మరోవైపు ‘ఆహా ఇండియన్‌

Update: 2023-04-19 10:27 GMT

దిశ,సినిమా: టాలీవుడ్‌లో ప్రజంట్ జెట్‌ స్పీడ్‌లో దూసుకెళుతున్నాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్. ఒకవైపు సినిమాలకు పనిచేస్తూనే మరోవైపు ‘ఆహా ఇండియన్‌ ఐడల్‌ షో’కు జడ్జిగా వ్యవహరిస్తూన్నాడు. అయితే ఇటీవల తాజాగా తమన్ ఓ మంచి పని చేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు. తన టీమ్‌లోని మ్యూజిషియన్ ఒకరు క్యాన్సర్ బారిన పడటంతో కీమో థెరపీ చేయాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న తమన్‌ ఆ మ్యూజిషియన్‌కు ఏకంగా రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాడు. ప్రజంట్ ఆ మ్యూజిషియన్ కోలుకుంటున్నాడు. అంతేకాదు గుంటూరులో ఓ పెద్ద అనాధాశ్రమం కూడా కడుతున్నాడట తమన్.

Read more:

ఆ బలంతోనే మాకు అవకాశాలు.. నెపోటిజంపై అలయ కామెంట్స్ వైరల్ 

Tags:    

Similar News