రాత్రి 10 గంటల తర్వాత ఆ పని చేయడం చాలా కష్టం.. కానీ వారు పిలుస్తారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్?
ఝుమ్మంది నాదం చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను.
దిశ, సినిమా: ఝుమ్మంది నాదం చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను. తర్వాత రవితేజ, గోపిచంద్, వెంకటేష్, ప్రభాస్ వంటి అగ్ర హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూనే అటు బాలీవుడ్ చిత్రాల్లో తన సత్తా చాటుతోంది. అతి తక్కువ సమయంలోనే తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్న ఈ బ్యూటీ రీసెంట్ గా డంకీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
గత ఏడాది రిలీజైన ఈ సినిమాలో తాప్సీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. బాలీవుడ్ లో తాప్సీకి పింక్ అనే చిత్రం మంచి పేరును తెచ్చి పెట్టింది. మొదటి సినిమా హిట్ కావడంతో ఈమెకు బీటౌన్ లో వరుస అవకాశాలు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఈ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. జామ్ నగర్ లో జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలను మీరు ఎందుకు హాజరవ్వలేదని ప్రశ్నించగా..
‘రాత్రి 10 గంటల తర్వాత పార్టీలు చేసుకోవడం నాకు ఇష్టముండదు. చాలా మంది స్టార్ హీరోలు కూడా బర్త్ డే పార్టీలకు పిలుస్తారు. కానీ నేను అలా చేయను. ఎందుకంటే మార్నింగే నిద్ర లేవడం నాకు అలవాటు. అందుకని త్వరగా నిద్రపోవాలి. సిగరెట్, మందు తాగే అలవాటు నాకు లేదు. ఇక పార్టీకి వెళ్లి ఏం చేయాలో నాకు అర్థం కాదు. అలాగే నాకు పరిచయం లేని వ్యక్తులతో పార్టీ చేసుకోవడం ఇష్టం ఉండదు. పార్టీలకు హాజరు కాకపోతే ఏం పనికి రారని అర్థం కాదు. రాత్రి 10 తర్వాత పార్టీలు చేసుకోవడం అంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది’’ అంటూ హీరోయిన్ తాప్సీ పన్ను వెల్లడించింది.