సుధాకొంగరతో సూర్య మరో సినిమా.. ఇది కూడా బ్లాక్ బ్లస్టరేనా?
హీరో ‘సూర్య’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దిశ, వెబ్‌డెస్క్: హీరో ‘సూర్య’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘జై భీమ్’ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక ‘ఆకాశమే నీ హద్దురా’ మూవీ ఏకంగా జాతీయ అవార్డు దక్కించుకునేలా చేశాయి. దీనికి కారకులు దర్శకురాలు సుధా కొంగర. 2020లో వచ్చిన ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించింది. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. ఈ చిత్ర షూటింగ్ జులైలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ మూవీని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మించబోతున్నారట. జీవీ ప్రకాశ్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.
Also Read: గోల్డ్ కలర్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న కృతి.. పిక్స్ వైరల్