అందుకే సూర్య, జ్యోతిక రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు!!

స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక జోడీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. . ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈ ఇద్దరు, పెళ్లి చేసుకున్న తర్వాత ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

Update: 2022-12-31 12:34 GMT

దిశ, సినిమా: స్టార్ కపుల్  సూర్య, జ్యోతిక జోడీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. . ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈ ఇద్దరు, పెళ్లి చేసుకున్న తర్వాత ఎందరికో ఆదర్శంగా నిలిచారు. వరుస చిత్రాలతో సూర్య దూసుకుపోతుంటే.. జ్యోతిక సినిమాలతో పాటు పిల్లల బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. అయితే సూర్య, జ్యోతిక రెండుసార్లు పెళ్లి చేసుకున్నారనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అసలు ఇలా ఎందుకు చేసుకున్నారంటే.. మొదట సూర్యతో పెళ్ళికి జ్యోతిక కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో సూర్య, జ్యోతిక రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో, అధికారికంగా ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో మళ్లీ మ్యారేజ్ జరిగింది. ఈ విధంగా సూర్య, జ్యోతిక రెండు సార్లు వివాహం చేసుకోవడం గమనార్హం.

Read more:

నా తప్పు తెలుసుకున్నా.. మెగా అల్లుడు కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్..

Tags:    

Similar News