Prabhas : అమెరికాలో ప్రభాస్‌కు సర్జరీ.. ఏడాది పాటు సినిమాలకు బ్రేక్!

ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.

Update: 2023-08-14 07:52 GMT

దిశ, సినిమా: ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. కంటిన్యూ షూటింగ్, ఎక్సర్‌సైజ్ తదితర కారణాలతో ప్రభాస్‌కు మోకాలి నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. డాక్టర్ సలహా మేరకు డిసెంబర్ వరకు ‘కల్కి 2898’ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసి, ఆ తర్వాత అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో మోకాలికి సర్జరీ చేయించుకోనున్నాడని సమాచారం. ఇక ఈ సర్జరీ తర్వాత కనీసం ఏడాదిపాటు ప్రభాస్ సినిమాలకు దూరంగా ఉంటాడని టాక్. అయితే ఈ ‘కల్కి 2898’ మూవీతో పాటు ప్రభాస్ మరో మూడు సినిమాలు ఒప్పుకున్నాడు. మారుతి దర్శకత్వంలో ఓ హారర్ మూవీ. ఆ తర్వాత దర్శకుడు సందీప్ వంగాతో ‘స్పిరిట్’, ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాతో మొత్తం మూడు చిత్రాల్లో నటించాల్సి ఉంది. కానీ ఇప్పుడతని అనారోగ్యం కారణంగా ఆ సినిమాలన్నీ ఆలస్యం కానున్నాయి. 

Read More : పవన్ కళ్యాణ్, రజినీకాంత్‌లో ఉన్న స్పెషల్ టాలెంట్ ఇదే.. మరెవరికి సాధ్యం కాదు!

Tags:    

Similar News