నా మొగుడు ఉన్నా నేను ఇలాగే చేసేదాన్ని.. సురేఖా వాణి సంచలన కామెంట్స్
టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి సురేఖా వాణి.
దిశ, సినిమా: టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి సురేఖా వాణి. సినిమాల్లో ఎంతో పద్ధతిగా అమ్మ, పిన్ని లాంటి పాత్రల్లో నిండైన చీరకట్టులో కనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం సురేఖా వాణి అందాల ఆరబోత మామూలుగా ఉండదు బాబోయ్. పబ్ లు, పార్టీలు అంటూ ఎప్పుడు చిల్ అవుతూ ఉంటుంది. ఏ ఇంటర్వ్యూకు హాజరైన ఘాటు ఘాటు సమాధానాలు చెబుతూ యాంకర్లకు దిమ్మతిరిగేలా చేస్తుంది.
అయితే ఈ నటి గుండు చేయించుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ కు గురవుతుంది. తాజాగా ఆ కామెంట్ల పై సురేఖా స్పందించి.. ‘‘నా పెళ్లైన కొత్తలో కూడా నేను గుండు చేయించుకున్నాను. మళ్లీ ఇప్పుడు చేయించుకున్నాను. 20 ఏళ్లు అవుతుంది. మేము తిరుపతి వెళ్తుంటాం. లైఫ్ లో ఈ ప్రాబ్లమ్స్ ఏంటి? దేవుడా నాకు ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించు.. ఇంకేం వద్దు అని మొక్కుకుని గుండు చేయించుకున్నాను.
దీనికి సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్లు చేస్తున్నాను. మొగుడు పోయాక విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నానని. నాకు 19 సంవత్సరాలకే పెళ్లి చేశారు. తర్వాత కుటుంబ బాధ్యతలు చూసుకున్నాను. ఇప్పుడు కొంచెం నా కుమార్తెతో ట్రిప్స్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నాను. తప్పా?నా భర్త ఉన్న ఇలాగే ఉండేదాన్ని’’. అంటూ సురేఖా వాణి చెప్పుకొచ్చింది.