తండ్రి చనిపోయిన ఇన్ని రోజులకు కీలక నిర్ణయం తీసుకున్న మహేశ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంటిలో ఈ ఏడాది వరుసగా విషాదాలు జరిగాయి. అన్న, అమ్మని పోగొట్టుకున్న మహేశ్
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంటిలో ఈ ఏడాది వరుసగా విషాదాలు జరిగాయి. అన్న, అమ్మని పోగొట్టుకున్న మహేశ్ తాజాగా తన తండ్రిని కోల్పోయి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అంతేకాదు.. ఆ బాధ నుంచి కోలుకోవడంతో పాటు షూటింగ్‌లు కూడా మొదలు పెట్టేశాడు. ఈ విషయాన్ని సూపర్ స్టార్ మహేశ్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. శనివారం మహేశ్ ఓ యాడ్ షూట్‌లో పాల్గొన్నాడు. ప్రముఖ కూల్ డ్రింక్ బ్రాండ్ యాడ్ షూటింగ్‌కి సంబంధించిన పిక్ షేర్ చేస్తూ ''బ్యాక్ టూ వర్క్'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ ఫొటోలో మహేశ్ చాలా పవర్ ఫుల్ లుక్‌లో కనబడుతున్నారు.