వంద సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపించే సూపర్‌హిట్ యూత్‌ఫుల్ మూవీ రీరిలీజ్.. ఎప్పుడంటే
బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ‘పోకిరి’, ‘సింహాద్రి’ లాంటి సినిమాలు మళ్లీ రిలీజ్ అవుతున్న సీజన్ ఇది.
దిశ, సినిమా : బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ‘పోకిరి’, ‘సింహాద్రి’ లాంటి సినిమాలు మళ్లీ రిలీజ్ అవుతున్న సీజన్ ఇది. 4K వెర్షన్‌లు రీ రిలీజ్ అవుతూ అభిమానులను మరల అలరిస్తున్నాయి. ప్రేమికుల రోజున విడుదలైన ‘ఓయ్’ మూవీ వారం రోజుల పాటు మంచి కలెక్షన్‌లను నమోదు చేసింది. ఇక త్వరలో మరో ఆసక్తికరమైన రీ-రిలీజ్ వస్తుంది.
కొన్ని సినిమాలు సినీ లవర్స్‌కు ఎంతలా నచ్చుతాయంటే.. ఎన్నో వందల సార్లు చూసినా సరే మళ్లీ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోతుంటాం. అలాంటి సినిమాల్లో ‘హ్యాపీడేస్’ కూడా ఒకటి. పదహారేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఓ క్లాసిక్‌గా మిగిలింది. ట్రెండ్‌సెట్టింగ్ యూత్‌ఫుల్ కాలేజ్ డ్రామాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.
ముఖ్యంగా శేఖర్ కమ్ములా టేకింగ్, యాక్టర్స్ టెర్రిఫిక్ పర్మార్మెన్స్‌కి ఈ చిత్రం చూసి చాలా మంది ఇంజనీరింగ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఇక ఇలాంటి సినిమాను రీ-రిలీజ్ చేస్తే సినీ లవర్స్‌లో ఉండే ఎగ్‌జైట్‌మెంట్ అంతా ఇంతా కాదు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని ఏప్రిల్ రెండు లేదా మూడవ వారాల్లో రీ-రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
Read More..
ఆ మూవీ కోసం 31 కిలోలు తగ్గాను : పృథ్వీరాజ్ సుకుమారన్