ఆమెతో గడిపిన ప్రతి క్షణం మధురమైనదే.. కత్రినపై మరిది ప్రశంసలు

హీరోయిన్ కత్రినా కైఫ్‌తో తనకున్న బంధం ఎలాంటిదో వివరించాడు సన్నీ కౌశల్.

Update: 2023-03-30 11:31 GMT

దిశ, సినిమా: హీరోయిన్ కత్రినా కైఫ్‌తో తనకున్న బంధం ఎలాంటిదో వివరించాడు సన్నీ కౌశల్. విక్కీ కౌశల్ తమ్ముడు, నటుడిగా సుపరిచితుడైన సన్నీ.. వదిన, తాను తక్కువ కాలంలోనే మంచి స్నేహితులయ్యామని చెప్పాడు. ఆమెతో గడిపిన ప్రతి క్షణాన్ని మధురమైన జ్ఞాపకంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపాడు. రెండేళ్ల క్రితం తన పుట్టినరోజు వేడుకకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చి ఆశ్చర్యపరిచిందని తెలిపాడు.

అంతేకాదు తనకు చాలా ఇష్టమైన స్నీకర్స్ ఆకారంలో ఉన్న పెద్ద కేక్ కట్ చేయించిందని గుర్తుచేసుకున్నాడు. అయితే ఆమె తన బర్త్ డే పార్టీకి వస్తుందని ఊహించలేదన్న సన్నీ.. ఇప్పుడు ఏకంగా తమ ఇంట్లో ముఖ్యమైన వ్యక్తిగా ఉండటం గొప్పగా ఉందంటూ ప్రశంసలు కురిపించాడు.

ఇవి కూడా చదవండి: రజనీతో ఆ సినిమా చేయడం వల్లే నా కెరీర్‌ క్లోజ్ అయింది: మనీషా

Tags:    

Similar News